Advertisement

  • ఏపీలో పంచాయితీ ఎన్నికల పిటిషన్ పై హైకోర్ట్ లో జరిగిన విచారణ

ఏపీలో పంచాయితీ ఎన్నికల పిటిషన్ పై హైకోర్ట్ లో జరిగిన విచారణ

By: Sankar Thu, 03 Dec 2020 3:32 PM

ఏపీలో పంచాయితీ ఎన్నికల పిటిషన్ పై హైకోర్ట్ లో జరిగిన విచారణ


ఏపీలో పంచాయితీ ఎన్నికల విషయంలో సస్పెన్సు అలాగే కొనసాగుతుంది...ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందు వలన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం హై కోర్ట్ లో పిటిషన్ వేసింది...తాజాగా ప్రభుత్వం వేసిన పిటీషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది.

కరోనా నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా కరోనా కారణంతో తక్కువ పోలింగ్ జరిగిందని ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేశారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆరువేల మంది చనిపోయారని వాదించారు. అయితే హై కోర్టు ఆదేశాల మేరకే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని ఎన్నికల కమిషనర్ న్యాయవాది అశ్వనీ కుమార్ చెప్పారు.

ఎన్నికల నిర్వహణ పై నిర్ణయం తీసుకునే అధికారం కమిషనర్ కు ఉందని న్యాయవాది వాదించారు. ఎన్నికల నిర్వహణ పై సుప్రీంకోర్టు, హై కోర్టు తీర్పులను తమ ముందు ఉంచాలని హై కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రకటన పై స్టేటస్ కో అడిగిన ప్రభుత్వం..నిరాకరించిన హై కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తామని నవంబర్ 17న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచిన ప్రొసిడింగ్స్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది

Tags :
|

Advertisement