Advertisement

కరోనా నియంత్రణలో ఏపీ మంచి పురోగతి సాధించింది

By: chandrasekar Mon, 07 Sept 2020 3:41 PM

కరోనా నియంత్రణలో ఏపీ మంచి పురోగతి సాధించింది


దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా ఇప్పుడు రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడింది. ఏపీలో ఓ వైపు కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నా కట్టడికి తీసుకుంటున్న చర్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కరోనా నియంత్రణలో ఏపీ మంచి పురోగతి సాధించిందని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ప్రశంసించింది. తాజాగా విడుదల గణాంకాలు కూడా ఇదే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 77.30 కాగా..ఏపీలో 79.10 శాతం. మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.72 కాగా..ఏపీలో 0.89 శాతం. దేశంలో ప్రతి మిలియన్ కు 35 వేల 206 పరీక్షలు చేస్తుంటే..ఏపీలో 76 వేల 927 మందికి పరీక్షలు. రాష్ట్ర౦లో గత 24 గంటల్లో అత్యధికంగా 72 వేల 573 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి రికార్డు సృష్టించింది ఏపీ ప్రభుత్వం. పది కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు సైతం ఇన్ని పరీక్షలు ఒకేసారి చేసిన పరిస్థితి ఎక్కడా లేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 41 లక్షల 7 వేల 890 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 10 వేల 794 పాజిటివ్ కేసులు నమోదు కాగా 70 మంది మరణించారు. కాగా 11 వేల 915 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఇప్పటివరకూ 4 లక్షల 98 వేల 125 కాగా 3 లక్షల 94 వేల 19 మంది కోలుకున్నారు. ఇంకా యాక్టివ్ కేసులు ఏపీలో 99 వేల 689 ఉన్నాయి. ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా 4 వేల 417 మంది మృతి చెందారు. ఇక ప్రతి పది లక్షల మంది జనాభాకు 76 వేల 927 పరీక్షలు రాష్ట్రంలో చేస్తూ అగ్రస్థానంలో ఉంది.

Tags :
|
|
|

Advertisement