Advertisement

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... దీపావళి సంబరాలపై..!

By: Anji Wed, 11 Nov 2020 2:57 PM

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... దీపావళి సంబరాలపై..!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పండుగలలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

పూర్తి విషయంలోకి వెళితే కాలుష్యం కారణంగా కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు దీపావళి పండుగ పర్వదినం నాడు రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవాలి అని తెలిపింది. అది కూడా రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది.

టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

షాపుల వద్ద కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించాలని సూచించింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది.

Tags :
|

Advertisement