Advertisement

కరోనా పరీక్షల ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం..

By: Sankar Fri, 13 Nov 2020 09:09 AM

కరోనా పరీక్షల ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం..


ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. కరోనా నిర్ధారణ పరీక్షల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రైవేటు ల్యాబరేటరీల్లో కోవిడ్ 19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్ లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబరేటరీల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలను సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు మార్కెట్ లో పూర్తిగా అందుబాటులోకి రావటంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ప్రభుత్వం పంపించే నమూనాలకు రూ. 800 మాత్రమే వసూలు చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా తీసుకువచ్చే నమూనాలకు రూ. 1000 వరకూ వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం..

ఇక ఏపీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 849705కి చేరింది. ఇందులో 822011 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 20857 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6837కి చేరింది.

Tags :
|
|
|

Advertisement