Advertisement

  • కరోనా టెస్టుల ధరలను భారీగా తగ్గించిన ఏపీ ప్రభుత్వం

కరోనా టెస్టుల ధరలను భారీగా తగ్గించిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Tue, 15 Dec 2020 8:00 PM

కరోనా టెస్టుల ధరలను భారీగా తగ్గించిన ఏపీ ప్రభుత్వం


ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి ..ఒకానొకదశలో రోజుకి పదివేలదాకా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..కానీ ఇప్పుడు మాత్రం రోజులు అయిదు వందలకు దగ్గరగానే నమోదు అయితున్నాయి...ఇక కరోనా టెస్టులు చేయించుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం...

ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరలను రూ. 800 నుంచి రూ. 475కు తగ్గించింది ప్రభుత్వం... ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లకు వెళ్లి చేయించుకునే కరోనా టెస్టింగ్ ధరలను రూ. 1000 నుంచి రూ. 499కు కుదించింది. మొత్తంగా ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లకు వెళ్లి చేయించుకునే కోవిడ్‌ టెస్ట్ ధర సగానికి తగ్గించగా.. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరను దాదాపు సగం వరకు కుదించింది.

అయితే కరోనా టెస్ట్ కిట్ల తయారీ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు తగ్గాయని జీవోలో పేర్కొంది. ఈ మేరకు కరోనా టెస్టింగ్ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..ఇక ఈ రోజు ఏపీలో కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి

Tags :
|
|
|
|
|

Advertisement