Advertisement

  • కొత్త సంవత్సరం కానుకగా ఏపీలో ఇంటికే రేషన్ డెలివరీ ...

కొత్త సంవత్సరం కానుకగా ఏపీలో ఇంటికే రేషన్ డెలివరీ ...

By: Sankar Sun, 20 Dec 2020 4:31 PM

కొత్త సంవత్సరం కానుకగా ఏపీలో ఇంటికే రేషన్ డెలివరీ ...


ఏపీలో జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది..ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం... మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. రేషన్‌లో అందించే నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే డెలివరీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు 9260 వాహానాలను సిద్దం చేసింది జగన్‌ ప్రభుత్వం. టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసింది సర్కార్‌. డెలివరీ ట్రక్కుల్లోనే కటా పెట్టి ఇళ్ల వద్దే రేషన్ పంపిణీ చేయనున్నారు.

ట్రక్కులో ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండనుంది. ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టం ఏర్పాటు చేశారు. సబ్సిడీ ద్వారా డోర్ డెలివరీ చేసే వాహానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించింది ప్రభుత్వం.

Tags :
|
|

Advertisement