Advertisement

ఏపీలో అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ ప్రారంభం ?

By: Sankar Tue, 08 Sept 2020 7:57 PM

ఏపీలో అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ ప్రారంభం ?


ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్‌లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. కరోనా తరవాత కాలేజీలు,పాఠశాలలు,యూనివర్సిటీల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. కరోనా తర్వాత పరిస్థితులను అంచనా వేసి మార్గదర్శకాలు సిద్దం చేసినట్టు స్పష్టం చేసారు.

అయితే కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా స్కూల్స్ , కాలేజీలు మూసివేసి దాదాపు ఆరు నెలలు దాటింది..దీనితో చాల రాష్ట్రాలు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించాయి..అయితే కరోనా ఇంకా తగ్గకపోవడంతో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభం అయ్యేది ఎవరు చెప్పలేకపోతున్నారు

Tags :
|
|
|

Advertisement