Advertisement

  • టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌తో ఏపీ ప్రభుత్వం చర్చలు...మాన్యుఫాక్చరింగ్ యూనిట్

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌తో ఏపీ ప్రభుత్వం చర్చలు...మాన్యుఫాక్చరింగ్ యూనిట్

By: chandrasekar Tue, 08 Sept 2020 11:42 AM

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌తో ఏపీ ప్రభుత్వం చర్చలు...మాన్యుఫాక్చరింగ్ యూనిట్


ఆంధ్రాలో ఐఫోన్ తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌తో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌తో ఏపీ ప్రభుత్వం చర్చలు యూనిట్ కడప జిల్లాలోని కొప్పర్తిలో ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ‘ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. కొప్పర్తి అనువుగా ఉంటుందని అనుకున్నాం. తర్వాత చెబుతామని వారు బదులిచ్చారు’ అని మేకపాటి గౌతమ్ తెలిపారు. చైనాలో ఆపిల్‌కు ఆరు ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. ఒక మానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కనిష్టంగా లక్ష మంది, గరిష్టంగా ఆరు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి తెలిపారు

మహిళా సాధికారికతకు ఆపిల్ లాంటి సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయని, మహిళ హక్కులను గౌరవించే చోట యూనిట్లను ఏర్పాటు చేస్తామని గౌతమ్ తెలిపారు. ఈ విషయంలో వారికి ఏపీ మంచి ఛాన్స్‌గా ఉంటుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన వైఎస్సార్సీపీ సర్కారు ఆర్థిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. టీడీపీ హయాంలో రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదరగా వాస్తవంగా రూ. 50 వేల కోట్ల మేర కూడా పెట్టుబడులు రాలేదని ఆయన అన్నారు

Tags :
|
|

Advertisement