Advertisement

  • కరోనా టెస్టుల విషయంలో ప్రైవేట్ ల్యాబులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కరోనా టెస్టుల విషయంలో ప్రైవేట్ ల్యాబులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Mon, 27 July 2020 1:50 PM

కరోనా టెస్టుల విషయంలో ప్రైవేట్ ల్యాబులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం



దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి ..టెస్టులకు తగ్గట్లే కేసులు కూడా అంతే స్థాయిలో నమోదు అయితున్నాయి ..అయితే తాజాగా కరోనా టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .. ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది..

ర్యాపిడ్‌ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్‌ ఆంటీజన్‌ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నమూనాని విఆర్‌డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రతి ల్యాబ్‌ పరీక్షల్లో ఐసీఎంఆర్‌ లాగిన్‌లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్‌ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కాగా తొలిసారిగా ప్రతి పది లక్షల జనాభాకి సగటున 30,774 మందికి పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. దేశ సగటు 11,746గానే ఉంది. గడిచిన 24 గంటల్లో 47,645 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 16,43,319కి చేరింది.

Tags :
|
|
|
|

Advertisement