Advertisement

  • భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు: మంత్రి కన్నబాబు

భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు: మంత్రి కన్నబాబు

By: chandrasekar Tue, 08 Dec 2020 08:27 AM

భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు: మంత్రి కన్నబాబు


గత కొన్ని రోజులుగా రైతులు ఢిల్లీని చుట్టుముట్టడంతో నిరసన పెద్దగా చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న భారత్ బంద్ జరగనుంది. ఇందుకోసం ఈ రోజు దేశవ్యాప్త బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల బంద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 8వ తేదీన భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలంటూ దాదాపు 11 రోజులుగా రైతులు సమ్మెకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా రైతులు చేరుకుని నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 8వ తేదీన దేశవ్యాప్త బంద్ తలపెట్టారు. రైతుల తలపెట్టిన భారత్ బంద్‌కు దేశంలోని వివిధ పార్టీలు మరియు ప్రభుత్వాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. కానీ మొన్నటివరకూ బంద్‌కు మద్దతివ్వమని చెప్పిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మద్దతిస్తున్నామని ఇప్పుడు ప్రకటించారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ప్రకటించాయి. బంద్ ను విజయవంతం చేయాలనీ నిర్ణయించాయి.

రైతులు చేపట్టనున్న బంద్ విషయంలో ఇన్ని రోజులు వైఖరి స్పష్టం చేయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తన పరోక్ష మద్దతును తెలిపింది. రైతుల తలపెట్టిన భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం పరోక్షంగా మద్దతిస్తుందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఎస్ఆర్టీసీ , ప్రభుత్వ కార్యాలయాల్ని మధ్యాహ్నం ఒంటి గంట తరువాతే తెరవాలని సూచించింది. ప్రస్తుతం రైతులు మరియు రైతు సంఘాల ఆందోళనల్ని ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపింది. హింసాత్మక ఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. రైతుల మనోభావాలకు ప్రభుత్వం గౌరవమిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు ప్రయోజానాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం చెప్పడంతోనే వైసీపీ ప్రభుత్వం బిల్లులకు మద్దతిచ్చిందన్నారు. భారత్ బంద్ ఉదయం 11 గంటల్నించి మద్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల్నించి యధావిధిగా పనులు చేసుకోవచ్చు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో ఏపీఎస్సార్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కవని తెలిసింది. మరి కేంద్ర ప్రభుత్వం చట్టాలను మార్పుచేస్తుందా లేదా అని తెలిసియాల్సిన సమయం ఆసన్నమైంది.

Tags :

Advertisement