Advertisement

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధం...

By: Sankar Wed, 18 Nov 2020 4:06 PM

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధం...


ఏపీ ప్రజలకు ఒక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ వ్యాప్తంగా డిసెంబరు 25వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధమైంది.

కోర్టు స్టే ఉన్న ప్రాంతాలు మినహా మిగతా చోట్ల పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలు కానున్నాయి. తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఫామ్ డీ పట్టాలు ఇచ్చే ఇంటి స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

నిజానికి ఏపీ ప్రజలకు ఎప్పుడో ఈ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ అనేక కారణాల వలన ఇది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇక ఏమాత్రం వాయిదా కూడదని భావిస్తోన్న ప్రభుత్వం ఈ మేరకు ముందుకు వెళ్తోంది. నిజానికి స్థానిక ఎన్నికల ముందు ఈ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఎన్నికలు ప్రభుత్వం వద్దు అంటుంటే ఎన్నికల కమిషన్ పెడతామని అంటోంది. ఆ విషయంలో ఇద్దరి మధ్య సందిగ్ధత కూడా నెలకొంది.

Tags :

Advertisement