Advertisement

ఏపీ వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...!

By: Anji Thu, 01 Oct 2020 6:02 PM

ఏపీ వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...!

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు వాలంటీర్లకు వాలంటీర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. దీనిపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఏడాది ఆగష్టు 15వ తేదీతో గడువు ముగిసిన వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.

కాగా, జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ గతేడాది ఆగష్టు 15న ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతీ పధకం నేరుగా లబ్దిదారులకు ఇంటి వద్దకే చేరేలా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు.

ఈ క్రమంలోనే మొదటి స్పెల్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లను ఏడాది కాలానికి ప్రభుత్వం నియమించుకుంది. వారి పదవీకాలం ఆగష్టు 14తో ముగిసింది. దీనితో తాజాగా మరో ఏడాది పొడిగించింది.

ఇక పొడిగింపు సమయంలో వాలంటీర్ల పనితీరును, వ్యక్తిగత ప్రవర్తననూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Advertisement