Advertisement

  • డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు..ఏపీ విద్యాశాఖ మంత్రి

డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు..ఏపీ విద్యాశాఖ మంత్రి

By: Sankar Wed, 24 June 2020 10:43 AM

డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు..ఏపీ విద్యాశాఖ మంత్రి



కరోనా కారణంగా వరుసగా అన్ని పరీక్షలు రద్దు అవుతున్నాయి..కరోనా ఉదృతి అంతకంతకు పెరుగుతుంది తప్ప ఇప్పట్లో తగ్గే సూచనలు లేకపోవడంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు పది పరీక్షలు రద్దు చేసాయి ..వీటి బాటలోనే దేశంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా నడిచాయి ..అయితే ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది .

ఇప్పటికే డిగ్రీ మొదటి , రెండవ సంవత్సరాల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేసిన జగన్ సర్కార్, ఇప్పుడు తాజాగా చివరి ఏడాది మరియు వృత్తి విద్య కోర్సుల్లో చివరి సెమిస్టరు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ..అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్‌లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చివరి సెమిషర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Tags :
|
|
|

Advertisement