Advertisement

  • ప్రజలకు ఉల్లి ధరల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ప్రజలకు ఉల్లి ధరల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

By: Sankar Thu, 22 Oct 2020 09:29 AM

ప్రజలకు ఉల్లి ధరల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్


గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఉల్లి పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర రూ. 100 పలుకుతుంది. ఉల్లికి డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.

దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కర్నూలు, తాడేపల్లి గూడెంలోని హోల్ సేల్ మార్కెట్లలో ఉల్లి కొనుగోలు చేసింది. వీటిని రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాలని చూస్తోంది. కిలో ఉల్లి రూ.40 కి విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.

రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లలో శుక్రవారం నుంచి సబ్సిడీ ధరలకు ఉల్లిని అందుబాటులో ఉండబోతున్నాయి. రెండోదశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని రైతు బజార్లలో ఉల్లి సబ్సిడీ ధరకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం తెలిపింది.

Tags :
|
|

Advertisement