Advertisement

  • థియేటర్ల యజమానులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

థియేటర్ల యజమానులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Fri, 18 Dec 2020 8:47 PM

థియేటర్ల యజమానులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం


కరోనా కారణంగా గత ఎనిమిది నెలలుగా థియేటర్లు మూతపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న థియేటర్ల యజమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది...3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేసింది ప్రభుత్వం. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.

దీనితో నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ కేబినెట్ తెలిపింది. మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.దింతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది.

రీస్టార్ట్‌ ప్యాకేజీకింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు, ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Tags :
|

Advertisement