Advertisement

  • అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

By: Sankar Thu, 10 Sept 2020 06:29 AM

అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం ఆదివారం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది.

అంతర్వేది దేవస్థానానికి స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఆఫీసర్‌గా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌కు బాధ్యతలు అప్పగించింది. అంతర్వేదిలో పరిస్థితులను పర్యవేక్షించాలని, కొత్తగా తయారు చేస్తున్న రథం పనులను పర్యవేక్షించాలని తెలిపింది. 15రోజులపాటు స్పెషల్ ఆఫీసర్ అక్కడే ఉండి చూసుకోవాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఆలయ ఇన్‌చార్జి ఈవో NS. చక్రధరరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

కాగా అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి..అయితే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి ఆ విమర్శలను తిప్పి కొట్టాడు..చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలను ద్వాంసం చేసారు అప్పుడు జనసేన , బీజేపీ ఎవ్వరు నోరెత్తలేదు..అందులో వారికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు ఉంది అని వ్యాఖ్యానించారు..రథం దగ్ధం ఘటనలో ఉన్న వారిని ఎవరిని వదిలేది లేదు అని అన్నారు మంత్రి

Tags :
|

Advertisement