Advertisement

  • కరోనా వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ..18 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

కరోనా వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ..18 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

By: Sankar Wed, 11 Nov 2020 4:36 PM

కరోనా వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ..18 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు


కరోనా వ్యాక్సిన్ పంపిణిపై ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణి కోసం 18 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

రాష్ట్రంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవరికి ఎలా అందించాలి, ఎక్కడ స్టోర్ చేయాలి తదితర విషయాలపై ఈ స్టీరింగ్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటగా ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వారికి అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వారికి అందించిన తరువాత ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఏపీ పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు..కాగా ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి ఇంతకుముందు రోజుకి పదివేల వరకు నమోదు అయినా పాజిటివ్ కేసులు ఇపుడు కేవలం రెండు వెలలోపే నమోదు అయితున్నాయి..

Tags :

Advertisement