Advertisement

  • వరుస తుఫాన్ల కారణంగా అప్రమత్తం అయిన ఏపీ ప్రభుత్వం

వరుస తుఫాన్ల కారణంగా అప్రమత్తం అయిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Sat, 28 Nov 2020 8:42 PM

వరుస తుఫాన్ల కారణంగా అప్రమత్తం అయిన ఏపీ ప్రభుత్వం


వరుస తుపానులు పొంచి ఉన్న కారణంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. పట్టణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని బొత్స ఆదేశించారు.

మరో తుఫాను హెచ్చరిక ఉన్నందున్న మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూంలు కొనసాగించాలని సూచించారు. మంచినీటి చెరువులకు గండి పడకుండా పర్యవేక్షణ చేపట్టాలని మంత్రి బొత్స కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బొత్స ఆదేశించారు. తెలుగు రాష్ట్రాలపై విరుచుకు పడేందుకు మరో అల్పపీడనం కాచుకుని కూర్చుంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత 24 గంటల్లో అది వాగుయుండగా బలపడుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం పశ్చిమంగా పయనిస్తూ మరింత బలపడి తమిళనాడు, పుదుచ్ఛేరిలను డిసెంబర్‌ రెండున తాకవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు

Tags :
|
|

Advertisement