Advertisement

  • అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ద్యేయం ...మంత్రి ఆదిమూలపు సురేష్

అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ద్యేయం ...మంత్రి ఆదిమూలపు సురేష్

By: Sankar Tue, 15 Dec 2020 5:50 PM

అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ద్యేయం ...మంత్రి ఆదిమూలపు సురేష్


ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ కేటగిరీలలో కొన్ని స్థానాలు బ్లాక్ చేయడం గతం నుంచి వస్తున్న విధానమేనని.. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన వివరించారు..

కేటగిరీ 4లో కూడా కొన్ని స్థానాలు బ్లాక్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీలలో బదిలీలకు 48 వేల 897 ఖాళీలను గుర్తించాం. వెబ్ కౌన్సిలింగ్‌లో సర్వర్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని రేపటి వరకూ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చాం. బదిలీలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాన్స్ ఫర్ పోర్టల్‌లో ఉంచాం.

బ్లాక్ చేసిన స్థానాలను డీఎస్సీ నియామకాల సమయంలో భర్తీ చేస్తాం. అప్పుడు మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ పై ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో పూర్తిగా చర్చించామని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్షాలు మాట్లాడటం సబబు కాదని మంత్రి సురేష్‌ హితవు పలికారు.

Tags :
|
|

Advertisement