Advertisement

  • స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వ పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేసిన ఎలక్షన్ కమిషన్

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వ పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేసిన ఎలక్షన్ కమిషన్

By: Sankar Thu, 17 Dec 2020 3:11 PM

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వ పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేసిన ఎలక్షన్ కమిషన్


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ కు , ప్రభుత్వానికి మధ్య రగడ నడుస్తూనే ఉంది..స్థానిక సంస్థల ఎన్నికల విషయం ప్రస్తుతం ఏపీ హై కోర్ట్ లో ఉంది ..ఎన్నికల కమిషన్ ఎలాగయినా ఎన్నికలు పెట్టాలని భావిస్తుండగా , ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని చెబుతుంది...

తాజగా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఎస్ఈసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషనన్‌ను డిస్మిస్ చేయాలని హైకోర్టును కోరింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ పేరుతో ఎన్నికలు అడ్డుకోవద్దని.. రాష్ట్రవ్యాప్తంగా గతంలో రోజుకు 10వేల కేసులు, ఇప్పుడు 3వేలు కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. స్కూళ్లు, థియేటర్లు, మాల్స్‌కు ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేసింది.

వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్నాయని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి 3 నుంచి 6 నెలలు పడుతుందని.. ఎన్నికల వల్ల వ్యాక్సిన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల్ని కాల రాస్తోందని.. ఎన్నికల విధుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీం కోర్టు తెలిపిందని గుర్తు చేశారు. ఇటీవలే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయని.. బీహార్, రాజస్థాన్‌లలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు ఓకే చెప్పిందని అఫిడవిట్‌లో ప్రస్తావించింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Tags :
|

Advertisement