Advertisement

ఏపీలో నేటినుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్

By: Sankar Mon, 28 Dec 2020 7:34 PM

ఏపీలో నేటినుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్


ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం (నేటి) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఈ నెల 31వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జనవరి 1న ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కలి్పస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 88,667 మంది అభ్యర్థులు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్‌ కానివారికి కూడా ధ్రువపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు. ఇలాంటివారు ఈనెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి సరి్టఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చు.

అభ్యర్థుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్‌ కేంద్రాలను జనవరి 1వ తేదీవరకు కొనసాగించాలని కనీ్వనర్‌ నిర్ణయించారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలనను ఈనెల 29న విజయవాడ పాలిటెక్నిక్‌ కాలేజీలో చేపట్టనున్నారు. రిజిస్టర్‌ అయి ఉన్న వారు మొబైల్‌ నంబరు మార్పు, లాగిన్‌ ఐడీ తదితర అంశాలపై హెల్ప్‌లైన్‌ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు.

Tags :
|
|
|
|

Advertisement