Advertisement

  • వైఎస్సార్ హోసింగ్ స్కీం మోడల్ ఇంటిని పరిశీలించిన సీఎం జగన్

వైఎస్సార్ హోసింగ్ స్కీం మోడల్ ఇంటిని పరిశీలించిన సీఎం జగన్

By: Sankar Wed, 19 Aug 2020 4:50 PM

వైఎస్సార్ హోసింగ్ స్కీం మోడల్ ఇంటిని పరిశీలించిన సీఎం జగన్


ఏపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి మోడల్ హౌస్‌లను సిద్ధం చేసింది. వైఎస్సార్‌ హౌసింగ్‌ స్కీమ్‌ కింద నిర్మించిన మోడల్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. తాడేపల్లి బోట్‌ హౌస్‌ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్‌ హౌస్‌ను నిర్మించింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పేదలకు కేటాయించే సెంటు స్థంలో తక్కువ ఖర్చుతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సౌకర్యవంతంగా నిర్మాణం చేసింది. 40 గజాల విస్తీర్ణంలో హాల్, బెడ్‌రూమ్, కిచెన్, వరండాలతో కూడిన ఈ నిర్మాణానికి రూ.2లక్షల 50వేలు ఖర్చు అవుతుంది.

అత్యంత తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రెండు రకాల మోడ‌ల్ హౌస్‌ల‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. వీటిపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.సెంటు స్థలంలో ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండటంతో నమూనాలను సిద్ధం చేసింది.

Tags :
|
|
|

Advertisement