Advertisement

తుంగభద్ర పుష్కరాలకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

By: Sankar Wed, 18 Nov 2020 4:37 PM

తుంగభద్ర పుష్కరాలకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్


తుంగభద్ర పుష్కరాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 20న కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌ను సందర్శిస్తారు.

సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సందర్శించే సంకల్‌భాగ్‌ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్పా ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు.

సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ వీరపాండియన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, నగరపాలక కమిషనర్‌ డీకే బాలాజీతో కలిసి నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెలిప్యాడ్, సంకల్‌భాగ్‌ ఘాట్‌ను పరిశీలించారు.

Tags :
|
|

Advertisement