Advertisement

  • నివర్ తుఫాన్: ఏపీ ప్రజలకు సీఎం జగన్ తీపి కబురు...!

నివర్ తుఫాన్: ఏపీ ప్రజలకు సీఎం జగన్ తీపి కబురు...!

By: Anji Mon, 30 Nov 2020 8:33 PM

నివర్ తుఫాన్: ఏపీ ప్రజలకు సీఎం జగన్ తీపి కబురు...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ తీపి కబురు తెలిపారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతీ రైతు సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతమని తెలిపారు.

ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నా. ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులను.. అదే సీజన్‌లోనే నష్టపరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే తొలిసారి.

రూ.126 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని అందించాం. అక్టోబర్‌లో వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు.. నవంబర్‌లో రూ.132 కోట్ల నష్టపరిహారం అందించినట్లు జగన్ తెలిపారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి రూ.500 ఆర్ధిక సాయం ఇవ్వాలని నిర్ణయించినట్లు జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి ఇంటికి రూ.2వేలు ఆర్ధిక సాయం అందుతుందన్నారు. డిసెంబర్ 15లోగా పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. డి

31లోగా పంట నష్ట పరిహారం చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు కూడా అందిస్తాం. ఇళ్లు, పశువులు, ఇతర నష్టాలను కూడా డిసెంబర్ 15లోగా అంచనా వేస్తాం.

డిసెంబర్ 31లోగా నష్టపరిహారం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.తుఫాను, వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. అంతేకాకుండా రంగు మారిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం. 2020 ఖరీఫ్ నుంచి బీమా బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఖరీఫ్‌ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి బీమా చెల్లింపు. పంటల ఉచిత బీమా కోసం ప్రభుత్వం రూ.1,030 కోట్లు చెల్లించిందని జగన్ తెలిపారు.

Tags :
|

Advertisement