Advertisement

  • చీరాల యువకుడు కిరణ్ మరణంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన సీఎం జగన్

చీరాల యువకుడు కిరణ్ మరణంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన సీఎం జగన్

By: Sankar Wed, 22 July 2020 5:11 PM

చీరాల యువకుడు కిరణ్ మరణంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన సీఎం జగన్



చీరాలలో ఈ నెల 18న ఎస్సై దాడిలో మృతి చెందిన యువకుడు కిరణ్‌ కేసు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంవో కార్యాలయం సేకరిచింది. యువకుడి మృతి కేసుపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మృతుడు కిరణ్‌ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.

ఈ ఘటనపై ఎస్పీ సిద్దార్థ్‌ కౌసల్‌ వివరణ ఇస్తూ.. చీరాల యువకుడు కిరణ్‌పై ఎస్సై విజయ్‌ కుమార్‌ దాడి చేశారనడం అవాస్తవమని తెలిపారు. ఈ నెల 18న చీరాల 2 టౌన్ పరిధిలో కిరణ్, అబ్రహం షైన్ అనే ఇద్దరు యువకులు మాస్క్ లేకుండా బైక్‌పై తిరుగుతుండగా ఎస్సై విజయ కుమార్ ఆపి యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పారు.

మద్యం మత్తులో ఉన్న కిరణ్‌, అబ్రహం షైన్‌లు పోలీసులతో వాగ్వాదానికి దిగారని తెలిపారు. దీంతో యువకులను పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా కిరణ్ కిందకు దూకడంతో తలకి బలమైన గాయం అయిందని చెప్పారు. అనంతరం హాస్పీటల్‌కు తరలించారని, చికిత్స అందిస్తున్న క్రమంలో కిరణ్‌ మంగళవారం మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.

Tags :
|
|
|

Advertisement