Advertisement

  • అక్షరాస్యతలో దేశంలో చిట్ట చివరి స్థానంలో ఏపీ ..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్

అక్షరాస్యతలో దేశంలో చిట్ట చివరి స్థానంలో ఏపీ ..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్

By: Sankar Tue, 08 Sept 2020 8:20 PM

అక్షరాస్యతలో దేశంలో చిట్ట చివరి స్థానంలో ఏపీ ..ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్


ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.. అక్షరాస్యత రేటు విషయంలో మాత్రం అట్టడుగున నిలిచింది. జాతీయ అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉండగా.. 66.4 శాతం అక్షరాస్యతతో ఏపీ దేశంలోనే చివరి స్థానంలో నిలిచింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 100 శాతం అక్షరాస్యత సాధించేలా రాష్ట్రాన్ని నడిపించే దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు

మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చగల, సాధికారికత చేకూర్చగల శక్తి చదువుకు ఉందన్నారు.

అంతటి ప్రాముఖ్యం గల విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు అమ్మ ఒడి, నాడు- నేడు, విద్యా దీవెన తదితర పథకాలను ప్రవేశపెట్టామని వెల్లడించారు. విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టి, 100 శాతం అక్షరాస్యత సాధించేలా రాష్ట్రాన్ని నడిపించే దిశగా ముందుకు సాగుతున్నామని సీఎం జగన్ తెలిపారు. అక్షరాస్యతలో ఏపీ అట్టడుగు స్థానంలో నిలిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :
|
|

Advertisement