Advertisement

  • ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలని మోడీకి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్

ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలని మోడీకి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్

By: Sankar Mon, 28 Sept 2020 6:45 PM

ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలని మోడీకి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్


గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. దాదాపు 50 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఈ నెల 25న తుదిశ్వస విడిచారు. 16 భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడిన ఒకే ఒక సింగర్ బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా అవార్డులు సంపాదించారు.

అయితే ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇదే విషయం పైన ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే హీరో అర్జున్‌ కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్పీ చరణ్‌ కూడా తన తండ్రికి భారతరత్న ఇస్తే సంతోషిస్తానని ప్రకటన చేశారు. ఇక నిన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యర్ధం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలని చంద్రబాబు కోరారు. కాంస్య విగ్రహం ఏర్పాటు-కళాక్షేత్రం అభివృద్ది-ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా జయంతి, జాతీయ పురస్కారం ఏర్పాటు-లలిత కళలకు ప్రోత్సాహం గురించి లేఖలో బాబు ప్రస్తావించారు.

Tags :
|
|
|

Advertisement