Advertisement

ఎపీలో అవినీతి నిరోధానికి దిశ తరహాలో బిల్లు

By: Dimple Tue, 25 Aug 2020 00:07 AM

ఎపీలో అవినీతి నిరోధానికి దిశ తరహాలో బిల్లు

అధికారులు లంచం తీసుకుంటూ దొరికితే నిర్దిష్ట సమయంలోనే చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురావాలని ఉన్నతాధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అవినీతి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

అవినీతి నిరోధానికి ‘దిశ’ తరహాలో బిల్లు రూపొందించాలని ఆదేశించారు. 1902కు వచ్చే అవినీతి సంబంధ ఫిర్యాదులన్నీ అవినీతి నిరోధకశాఖకు చెందిన 14400కు బదలాయించాలని సీఎం స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను అనుసంధానించాలని సీఎం నిర్దేశించారు. తహశీల్దార్‌, ఎంపీడీవో, సబ్‌రిజిస్ట్రార్‌, మున్సిపల్‌, పట్టణ ప్రణాళిక కార్యాలయాల్లో జరిగే అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని.. టెండర్‌ విలువ రూ.కోటి దాటితే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

Tags :
|
|
|

Advertisement