Advertisement

  • కింగ్ నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం జగన్

కింగ్ నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం జగన్

By: Sankar Sat, 29 Aug 2020 10:28 PM

కింగ్ నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం జగన్


తెలుగు అగ్ర నటుడు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విషెస్ చెప్పారు..తెలుగు సినీ ప్రపంచంలో ఎందరో గొప్ప నటుల్లో ఒకరైనా అక్కినేని నాగార్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, మరిన్ని విజయాన్ని ప్రసాదించాని భగవంతున్ని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ ట్వీట్‌ చేశారు.

సాధారణంగా సీఎం జగన్.. ముఖ్యమైన విషయాలు, వ్యక్తులపైనే ట్వీట్ చేస్తుంటారు. ముఖ్యంగా బర్త్ డే విషెస్‌లు చెప్పడం వంటివి చాలా అరుదు. కానీ, ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నాగార్జునకు బర్త్ డే విషెస్ చెప్పారు.

కాగా ముఖ్యమంత్రి జగన్‌కు, నాగార్జునకు మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వానికి నాగార్జున మద్దగా నిలిచారన్న ప్రచారం ఉంది.

Tags :
|
|
|
|

Advertisement