Advertisement

  • ఏపీ కేబినెట్ సమావేశం.... 22 అంశాలపై కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ సమావేశం.... 22 అంశాలపై కీలక నిర్ణయాలు

By: chandrasekar Thu, 16 July 2020 12:41 PM

ఏపీ కేబినెట్ సమావేశం.... 22 అంశాలపై కీలక నిర్ణయాలు


ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మొత్తం 22 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్‌ చేయుత పథకం వెనుకబడిన వర్గాలకు చెందిన 25లక్షలమందికి పైగా మహిళలకు వర్తింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో మహిళల ఖాతాల్లో రూ. 18,750 చొప్పున జమ చేయనున్నారు. ఆగస్టు 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

నాడు - నేడు కార్యక్రమాల్లో భాగంగా స్కూళ్లలో మౌలిక వసతులు పెంచుతున్నామని మళ్లీ నిధులు విడుదల చేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. రాయలసీమ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 420 టీచింగ్, 170 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ వద్దని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసనలు చేయగా.. వారిపై కేసులు నమోదు చేశారని వాటిని ఎత్తివేస్తన్నుట్లు తెలిపారు.

గుంటూరు పాత పోలీస్ స్టేషన్‌‌పై దాడి చేశారని కొంత మందిపై కేసులు పెట్టారు వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి దగ్గర రూ.5కోట్లతో గొర్రెల పెంపుకందారుల శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఓకే చెప్పారు. అనంతపురం జిల్లాలో కూడా మరో కేంద్రం ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఒకేసారి 9712 ఉద్యోగాల్ని భర్తీ చేయాలని నిర్ణయించారు. కర్నూలు జిల్లా కొమ్మమొర్రిలో రూ.9కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Tags :
|
|

Advertisement