Advertisement

ఏపీలో వందేళ్ల తర్వాత భూముల రీసర్వే

By: Sankar Thu, 05 Nov 2020 7:09 PM

ఏపీలో వందేళ్ల తర్వాత భూముల రీసర్వే


వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల రీ-సర్వేకు నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు వెల్లడించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీ-సర్వే చేయనున్నట్లు తెలిపారు. రీ-సర్వే కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు చెప్పిన ఆయన వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ 2023 నాటికి దశల వారీగా రీ-సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 4500 సర్వే టీములను సిద్దం చేస్తున్నాం. రీ-సర్వేలో ఉత్పన్నమయ్యే భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టుల ఏర్పాటు చేస్తున్నం అని అన్నారు.

ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తాం.. సర్వే రాళ్లను ప్రభుత్వమే ఇస్తుంది. గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటాము అని చెప్పిన కన్నబాబు 100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వేను చేయబోతున్నాం అన్నారు.

Tags :
|
|

Advertisement