Advertisement

ఏపీ బడ్జెట్ లో వాటికే అధిక ప్రాధాన్యం

By: Sankar Mon, 15 June 2020 9:00 PM

ఏపీ బడ్జెట్ లో వాటికే అధిక ప్రాధాన్యం



ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లను మంత్రులు వరుసగా ప్రవేశపెట్టనున్నారు. శాసన సభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటి సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నారు.

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రసంగం, బీఏసీ సమావేశం అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రూ. 2,27,975 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :
|
|

Advertisement