Advertisement

ఏపీ బడ్జెట్లో కొత్త రాజధాని ప్రస్తావన

By: Sankar Tue, 16 June 2020 9:21 PM

ఏపీ బడ్జెట్లో కొత్త రాజధాని ప్రస్తావన



ఏపీ బడ్జెట్‌లో కొత్త రాజధాని ప్రస్తావన వచ్చింది. కొత్త రాజధాని నగరంలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. కొత్త రాజధాని నగరంలో ల్యాండ్ పూలింగ్ కోసం రూ.189 కోట్లు కేటాయించింది. కొత్త రాజధాని అంటే కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో సదుపాయాల కోసమేమని అధికారులు అంటున్నారు.

కాగా సీఎం జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకుని అమరావతి నుంచి తరలిపోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా అధికారులు చెబుతున్న మాటల్లో అర్ధమవుతోంది. ఇందుకోసమే బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్లు సమాచారం.

గత బడ్జెట్‌లో కూడా అమరావతి అభివృ‌ద్దికి రూ. 500 కోట్లు కేటాయించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అమరావతి అభివృద్ధికి నోచుకోలేదు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు.

Tags :
|

Advertisement