Advertisement

అనుష్క నిశ్శబ్దం

By: chandrasekar Fri, 02 Oct 2020 4:05 PM

అనుష్క నిశ్శబ్దం


అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “నిశ్శబ్దం”. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ విడుదలైంది. ముందుగా అనుకున్న ప్రకారం థియేటర్ రిలీజ్ కి మొగ్గు చూపినా ఈ కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని కొంత సడలించి ఓటీటీ విడుదలకు సిద్ధమైంది చిత్రబృందం. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్‌తో పాటు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు.

ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి ఎలా గట్టెక్కాలా అని చిత్ర బృందం తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. నాని, సుధీర్ బాబు నటించిన వి ఈనెల 5న అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదలై మంచి టాక్’ను తెచ్చుకుంది. ఇక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాకు కూడా డీల్ కుదిరి ఓటీటీలో విడుదలైంది.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించాడు. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడడంతో విడుదల ఆగిపోయింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అయ్యేపనికాదన్న విషయం తేలిపోవడంతో, ఇన్నాళ్లూ ఆగిన నిర్మాత ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి అమ్మారు.

ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్ దాదాపు 25 కోట్లుపెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్ గా అక్టోబర్ 2 న అంటే ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. అత్యున్నత ప్రామాణికాలతో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ రిజల్ట్ కోసమే టాలీవుడ్ ట్రేడ్ పండితులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు మంచి అంచనాలు నడుమ ఓటీటీలో విడుదలయ్యాయి. కానీ ఊహించని విధంగా ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న అంచనాలను చేరుకోలేకపోయింది.

Tags :

Advertisement