Advertisement

  • సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన కోహ్లీ భార్య అనుష్క శర్మ

సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన కోహ్లీ భార్య అనుష్క శర్మ

By: Sankar Fri, 25 Sept 2020 5:26 PM

సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన కోహ్లీ భార్య అనుష్క శర్మ


ఇటీవల కాలంలో క్రికెట్ లో కామెంటేటర్లు చేస్తున్న కొన్ని వాక్యలు క్రికెటర్ల ఆగ్రహానికి గురి అయ్యేలా చేస్తున్నాయి..గత ఏడాది ప్రపంచ కప్ సమయంలో మంజ్రేకర్ జడేజా మీద చేసిన కామెంట్స్ ఏ స్థాయి దుమారాన్ని రేపినయో అందరికి తెలిసిందే ..తాజాగా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యం మీద చేసిన వ్యాఖ్యలు కూడా అదే స్థాయిలో వివాదాన్ని సృష్టిస్తున్నాయి..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఫీల్డింగ్‌లో, బ్యాటింగ్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న గావస్కర్.. కామెంట్రీ చెబుతూ.. లాక్‌డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే కోహ్లి ఎదుర్కొన్నాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..ఈ వ్యాఖ్యలపై కోహ్లీ భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు..

చాలా ఏళ్లుగా క్రికెట్ కామెంట్రీ చెబుతున్న మీరు... ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించి ఉంటారు. నాకు, కోహ్లికి కూడా ఇలాగే గౌరవం ఇవ్వాలని మీరు భావించలేదా? నా భర్త ఆటతీరు గురించి మాట్లాడానికి మీ మనసులో మరెన్నో పదాలు ఉంటాయని తెలుసు.

ఇది 2020 కానీ నా విషయంలో మాత్రం మారలేదు. క్రికెట్ విషయంలో నన్ను లాగడం ఎప్పుడు మానుకుంటారు. నాపై అభ్యంతర కామెంట్లు చేయడం ఎప్పుడు వదిలేస్తారు. గౌరవనీయులైన గావస్కర్... మీరో లెజెండ్.. క్రికెట్లో మీరెంతో ఖ్యాతిని ఆర్జించారు. మీరు ఇలా చెప్పడం వినగానే నాకెంతో బాధేసిందని చెప్పాలనుకుంటున్నా’’ అని అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా సమాధానం ఇచ్చారు.

Tags :

Advertisement