Advertisement

  • బడిశాలోని బెర్హాంపూర్‌లో యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌...

బడిశాలోని బెర్హాంపూర్‌లో యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌...

By: chandrasekar Fri, 06 Nov 2020 04:04 AM

బడిశాలోని బెర్హాంపూర్‌లో యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌...


కరోనా‌ వల్ల పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. చేతులు శానిటైజ్‌ చేసుకోవడంతోపాటు తినే ప్రతి వస్తువును పరిశీలించాల్సి వస్తున్నది. మహమ్మారి వల్ల వ్యాపారం నిలిచిపోయి సతమతమవుతున్న కొందరు వ్యాపారులు వినూత్న టెక్నిక్స్‌తో ముందుకొస్తున్నారు. ప్రతి వస్తువు యాంటీ వైరస్‌ అంటూ మార్కెట్‌లోకి వదులుతున్నారు. చెఫ్‌లు కొత్తరకం పేర్లతో వంటకాలు, డ్రింక్స్‌ ప్రిపేర్‌ చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఒకరు కరోనా వైరస్‌ ఆకారంలో ఉన్న బర్గర్‌ తయారుచేయగా, మరొకరు కరోనా వైరస్‌ పేరుతో కాక్‌టెయిల్‌ అమ్ముతున్నారు. అయితే, ఓ హోటల్‌ యజమాని ఇలాంటి సరికొత్త ఐడియాతో సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షించాడు. తన హోట్‌ల్‌కు ‘యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌’ అని పేరు పెట్టాడు. ఈ హోటల్‌ ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతోంది.

ఈ హోటల్‌ బడిశాలోని బెర్హాంపూర్‌లోగల గాంధీనగర్‌ మెయిన్‌రోడ్డులో ఉంది. ఈ బోర్డు అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో పెద్దసంఖ్యలో వచ్చి ఇక్కడ టిఫిన్‌ చేస్తున్నారు. ఇడ్లీ, పూరి, ఉప్మా, దోస, సమోసా, వడా, పకోడి, టాడియా, ఆలు చాప్ దొరుకుతాయని హోటల్‌ ఎదుట బోర్డు కూడా ఉంది.

ఇంతవరకూ బాగానే ఉన్న ఈ ఫొటోపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘హోటల్‌ పేరు యాంటీవైరస్‌ పెట్టారు కానీ చెఫ్‌ మాస్కుపెట్టుకోలేదు. అందరూ భౌతికదూరం పాటించకుండానే తింటున్నారు..’ అని ఒకరు కామెంట్‌ చేశారు. ‘యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌లో టిఫిన్స్‌లో శానిటైజర్‌ కలుపలేదుగదా..’ అంటూ ఒకరు సరదా ప్రశ్న సంధించారు. ‘యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌లో దోస తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.’ అంటూ మరొకరు చమత్కరించారు.

Tags :
|
|

Advertisement