Advertisement

  • రెండు వారాల్లోపు శ‌రీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి: ఆరోగ్య శాఖ‌

రెండు వారాల్లోపు శ‌రీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి: ఆరోగ్య శాఖ‌

By: chandrasekar Fri, 18 Dec 2020 5:53 PM

రెండు వారాల్లోపు శ‌రీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి: ఆరోగ్య శాఖ‌


ప్ర‌స్తుతం దేశంలో మొత్తం 6 వ్యాక్సిన్‌లు వివిధ ప్ర‌యోగ ద‌శ‌ల్లో ఉన్న‌ట్లు పేర్కొంది. వ్యాక్సిన్‌ల‌ను పూర్తి స్థాయిలో ప‌రీక్షించి, ప్ర‌యోగాలు జ‌రిపిన త‌ర్వాతే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి కాదు అని తెలిపింది. ఇక స‌మ‌ర్థ‌త విష‌యంలో ఇండియాలో త‌యారైన వ్యాక్సిన్ ఇత‌ర దేశాల వ్యాక్సిన్‌ల‌కు ఏమాత్రం తీసిపోవ‌ని కూడా తెలిపింది. దీనివల్ల శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని చెప్పింది. వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డానికి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవ‌డం మంచిదని తెలిపింది. రెండో డోసు తీసుకున్న రెండు వారాల్లోపు శ‌రీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయ‌ని వెల్ల‌డించింది.

గ‌తంలో ఈ వైర‌స్ బారిన ప‌డ్డారా లేదా అన్న‌దానితో సంబంధం లేకుండా అంద‌రూ పూర్తి స్థాయి వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించింది. వ్యాక్సినేష‌న్‌కు సంబంధించి త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల జాబితాను గురువారం రాత్రి రూపొందించిన ఆరోగ్య శాఖ మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. 28 రోజుల వ్య‌వ‌ధిలో రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపింది. వ్యాక్సిన్ వ‌ల్ల స‌హ‌జంగా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగూ ఉంటాయ‌ని, వ్యాక్సిన్ ఇచ్చిన ప్ర‌దేశంలో నొప్పి, జ్వ‌రంలాంటివే సాధార‌ణ‌మేన‌ని ఆరోగ్య శాఖ చెప్పింది.

వ్యాక్సిన్ పంపిణీతోపాటు ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ను కూడా ఎదుర్కొనేలా రాష్ట్రాలు సిద్ధంగా ఉండాల‌ని సూచించింది. క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్‌, హైబీపీల‌తో బాధ‌ప‌డుతున్న వాళ్లు ఈ వ్యాక్సిన్‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకుంటే మేల‌ని ఆరోగ్య శాఖ సూచించింది.

Tags :
|

Advertisement