Advertisement

  • వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన ప్రతిపక్ష పార్టీలు

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన ప్రతిపక్ష పార్టీలు

By: Sankar Wed, 09 Dec 2020 6:54 PM

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన ప్రతిపక్ష పార్టీలు


వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్ష నాయకుల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వినతి పత్రం అందజేసింది...ఆ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతు రైతులకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ..

ఇక వ్యవసాయ బిల్లులపై సరైన చర్చలు, సంప్రదింపులు జరుగకుండానే అప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్‌లో ఆమోదించారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. అందుకే అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు..

కాగా వ్యవసాయ బిల్లుల రద్దుపై గత కొన్ని రోజులుగా రైతు సంఘాలు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే...ఆ నిరసనలో భాగంగా నిన్న నిరవహించిన భారత్ బంద్ కూడా విజయవంతం అయింది..అయితే రైతులు ఈ వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఆ చర్చలు మాత్రం సఫలం కావడం లేదు..

Tags :

Advertisement