Advertisement

  • దేవికారాణికి చెందిన రూ.4.47కోట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం

దేవికారాణికి చెందిన రూ.4.47కోట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం

By: chandrasekar Wed, 02 Sept 2020 10:26 AM

దేవికారాణికి చెందిన రూ.4.47కోట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం


ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణికి సంబంధించి మరో రూ.4.47 కోట్ల రూపాయల మొత్తాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వైద్య బీమా సంస్థలో అవినీతికి పాల్పడటం ద్వారా సంపాదించిన మొత్తాన్ని ఆమె రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టడానికి ప్రయత్నించారని, ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి ఆరు ఫ్లాట్లను కొనేందుకు ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు సొమ్మును ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా చెల్లించినట్లు అధికారులు తెలిపారు.

రూ.4.47 కోట్ల రూపాయలలో దేవికారాణి సొమ్ము రూ.3.75 కోట్లుకాగా, నాగలక్ష్మి రూ.72లక్షలు పెట్టుబడిగా పెట్టారని సాక్షి పత్రిక కథనం. ఈ వ్యవహారం తెలియడంతో సదరు రియల్‌ ఎస్టేట్ డెవలపర్‌కు ఏసీబీ నోటీసులు పంపగా, ఆ సంస్థ ఈ పెట్టుబడి మొత్తాన్ని ఏసీబీకి అప్పగించింది.

దేవికారాణి వద్ద తాజాగా లెక్కకు అందని రూ.4 కోట్లకు పైగా సొమ్ము దొరకడంతో కీసర తహసిల్దారు దగ్గర దొరికిన అవినీతి సొమ్ము రూ.కోటి పది లక్షల రికార్డును దేవికారాణి అధిగమించినట్లయిందని సమాచారం.

Tags :
|

Advertisement