Advertisement

  • కరోనాపై యుద్ధంలో భారత శాస్త్రవేత్తలు మరో ముందడుగు

కరోనాపై యుద్ధంలో భారత శాస్త్రవేత్తలు మరో ముందడుగు

By: chandrasekar Mon, 14 Sept 2020 4:48 PM

కరోనాపై యుద్ధంలో భారత శాస్త్రవేత్తలు మరో ముందడుగు


కరోనా వైరస్‌ జన్యుక్రమాలను ఆన్‌లైన్‌ వేదికగా అంచనా వేసేందుకు దోహదపడే వెబ్‌ ఆధారిత ‘కొవిడ్‌ ప్రెడిక్టర్‌’ను ఆవిష్కరించారు. కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇంద్రజిత్‌ సాహా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ఘనతను సాధించింది. తాము రూపొందించిన ‘కొవిడ్‌ ప్రెడిక్టర్‌’తో దేశంలో వెలుగుచూసిన 566 కరోనా వైరస్‌ జన్యువులను విశ్లేషించి, సింగిల్‌ న్యూక్లియోటైడ్‌ పాలీమార్ఫిజం (ఎస్‌ఎన్‌పీ) ప్రాతిపదికన వాటిలో చోటుచేసుకున్న మార్పులపై ఓ అవగాహనకు వచ్చారు. దీనికోసం మెషీన్‌ లెర్నింగ్‌ పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించారు.

ఒక కరోనా పేషెంట్ నుంచి సేకరించిన నమూనాలోని వైరస్‌ జన్యువుల్లో ఒకే ఒక న్యూక్లియోటైడ్‌ వైవిధ్యంగా అమరి ఉంటే ఆ స్థితిని ‘ఎస్‌ఎన్‌పీ’ అని అంటారు. మొత్తం 64 ఎస్‌ఎన్‌పీలకుగానూ 57.. భారత్‌లోని ఆరు కరోనా జన్యువుల కోడింగ్‌ రీజియన్లలో ఉనికిలో ఉన్నట్లు ‘కొవిడ్‌ ప్రెడిక్టర్‌’ ద్వారా గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తమ పరిశోధనను ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన మరో 10వేల కరోనా జన్యుక్రమాలకు విస్తరించినట్లు పేర్కొన్నారు. వైవిధ్యమైన జన్యుమార్పులు జరిగిన ప్రదేశాలు భారత్‌లో 3,514 భారత్‌ మినహా ఇతర దేశాల్లో 18,997.. భారత్‌ సహా ప్రపంచదేశాల్లో 20,260 గుర్తించినట్లు తెలిపారు. భారత్‌లో జరుగుతున్న కరోనా జన్యుమార్పుల్లో 5.39 శాతానికి, మరో 72 దేశాల్లో జరుగుతున్న వైరస్‌ జన్యుమార్పులతో దగ్గరి పోలికలు ఉన్నాయని చెప్పారు. ఈ జాబితాలో అమెరికా (3.27 శాతం), బ్రిటన్‌ (3.59 శాతం)లు భారత్‌ వెంటే ఉన్నాయని వివరించారు.

Tags :
|

Advertisement