Advertisement

బైడెన్ ఖాతాలోకి మరో రాష్ట్రం...

By: chandrasekar Thu, 05 Nov 2020 5:53 PM

బైడెన్ ఖాతాలోకి మరో రాష్ట్రం...


డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఖాతాలోకి మరో రాష్ట్రం వచ్చి చేరింది. విస్కాన్సిన్ రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించారు.

ఈ రాష్ట్రంలో జో బైడెన్ 49.4 శాతం ఓట్లను గెలుపొందగా.. ట్రంప్ 48.8 శాతం ఓట్లను గెలుచుకున్నారు.

ఈ రాష్ట్రం ట్రంప్‌పై 0.6 శాతం ఓట్ల తేడాతో డెమొక్రాట్ల ఖాతాలోకి చేరింది. ఇక విస్కాన్సిన్‌లోని 10 ఎలక్టోరల్ ఓట్లు కూడా బైడెన్ కైవసం చేసుకోవడంతో.. ఆయన మొత్తం ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 237కు చేరుకుంది.

మ్యాజిక్ ఫిగర్(270)ను చేరుకోడానికి ఆయన ఇంకా 33 ఓట్లను గెలుచుకోవాల్సి ఉంది. మరోపక్క ట్రంప్ ఇప్పటివరకు 214 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నారు.

Tags :
|
|
|

Advertisement