Advertisement

ఏలూరు వాసులకు ఇంకో బెడద...

By: chandrasekar Tue, 08 Dec 2020 9:00 PM

ఏలూరు వాసులకు ఇంకో బెడద...


ఏలూరు వాసులు వింత వ్యాధితో భయపడుతుంటే మరొక బెడద వచ్చి పడింది. ఏ రోజు ఎవరి నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుమారు 476 మందికి పైగా ఈ వింత వ్యాధి బాధితులు ఉన్నారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. గంట గంటకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు ఇప్పటికే ఒకరి ప్రాణాలు కూడా పోయాయి. ఈక్రమంలో వింత వ్యాధి బాధితులను మరో కష్టం వచ్చింది. ఏలూరులో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. ఓపెన్ డ్రైనేజీ కారణంగా పందులు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఏలూరులోని దక్షిణం వీధి, పడమట వీధి, కొబ్బరి తోట, మహేశ్వరి కాలనీ, గాంధీ కాలనీ, తంగెళ్లమూడి, కొత్తపేట ఇతర ప్రాంతాల్లో జనం పందుల గోలను తట్టుకోలేకపోతున్నారు. దీని గురించి అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరులో తాజాగా వింత వ్యాధి ప్రబలిన తర్వాత వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పుడు ఓపెన్ డ్రైనేజీ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందుల గోల ఎక్కువైపోయింది. పందులు మేపేవాళ్లతో ఎన్నిసార్లు గొడవలు పెట్టుకున్నా, దీని గురించి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పాటు జనం కూడా ఓపెన్ డ్రైనేజీలో ఇష్టం వచ్చినట్టు చెత్త పడేస్తున్నారు. చికెన్, మటన్ దుకాణాల వారు కూడా అందులో వచ్చే చెత్తను తీసుకొచ్చి డ్రైనేజీల్లో పడేస్తున్నారు. దీన్ని మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేయడం లేదని ప్రజలు చెప్పారు. మురుగుకాల్వలను మున్సిపల్ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. కానీ, కాలువలో నుంచి తీసిన చెత్తను తీసుకుని రోడ్డు మీద పడేస్తున్నారు. దాన్ని ఎత్తడం లేదు. దీంతో మళ్లీ ఆ చెత్తంతా ఆ మురుగుకాలువలోకే పోతోంది. దీని వల్ల డ్రైనేజీ నిండిపోతుంది. సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పారు. ఓపెన్ డ్రైనేజీల కారణంగా జనం ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి.

ఏలూరులో వింత వ్యాధి సోకిన వారు మూర్ఛ వచ్చినట్టు పడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం లెడ్, నికెల్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వారి రక్తంలో లెడ్ అనే భార లోహం ఉండడం అని భావిస్తున్నారు. వారి బ్లడ్ శాంపిల్స్‌లో లెడ్, నికెల్ ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు జరిపిన పరీక్షల్లో తేలింది. “లెడ్” బ్యాటరీస్‌లో ఉండే పదార్ధం. ఈ భార లోహం ప్రమాదకరమైనది. ఇది మనుషుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అంటే మన శరీరంలోకి లెడ్ వెళ్తే మెదడు సరిగా పనిచెయ్యదు. తలనొప్పి, మతిమరపు లక్షణాలు వస్తాయి. అంతేకాదు దాంతో ఫిట్స్ వచ్చేస్తుంది. ఇక ఇన్ని వచ్చాక నీరసం ఇతరత్రా రావడం పెద్ద మేటరేమీ కాదు.

Tags :

Advertisement