Advertisement

  • జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం...పాఠశాలల డోర్ టు డోర్ క్యాంపెయిన్‌పై నిషేధం

జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం...పాఠశాలల డోర్ టు డోర్ క్యాంపెయిన్‌పై నిషేధం

By: chandrasekar Tue, 17 Nov 2020 11:27 AM

జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం...పాఠశాలల డోర్ టు డోర్ క్యాంపెయిన్‌పై నిషేధం


జగన్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు తమ వృత్తికి సంబంధం లేని పనులు చెప్పొద్దని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పాఠశాలలు ప్రారంభం కాగానే, ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన ఉపాధ్యాయులు అడ్మిషన్స్ కోసం విద్యార్థుల ఇళ్లకు వెళ్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

ప్రైవేట్ స్కూళ్లలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులు చెప్పొద్దని ప్రభుత్వం ఆదేశించింది. అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులను బలవంతంగా విద్యార్థుల ఇళ్లకు పంపొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా తమ పిల్లల్ని తమ ప్రైవేటు పాఠశాలలో చేర్చాలంటూ ఇళ్ల వద్దకు వస్తే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ప్రభుత్వ పాఠశాలల్ని పటిష్టపరిచేందుకు వైసీపీ ప్రభుత్వం వీలైనన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను బాగుచేయిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, విద్యా దీవెన, విద్యాకానుక వంటి పథకాలు ప్రవేశపెట్టారు. తాజాగా, ప్రవేటు పాఠశాలల డోర్ టు డోర్ క్యాంపెయిన్‌పై పరోక్షంగా నిషేధం విధించారు.

Tags :
|

Advertisement