Advertisement

  • అమెరికా నుంచి మరో శుభవార్త...కరోనా వాక్సిన్ సిద్ధం

అమెరికా నుంచి మరో శుభవార్త...కరోనా వాక్సిన్ సిద్ధం

By: chandrasekar Thu, 16 July 2020 5:05 PM

అమెరికా నుంచి మరో శుభవార్త...కరోనా వాక్సిన్ సిద్ధం


ప్రపంచవ్యాప్తంగా కరోనా వాక్సీన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. 20కి పైగా వాక్సీన్‌లు ప్రయోగ దశలో ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్‌‌ను విజయవంతంగా పూర్తిచేశామని ఇప్పటికే రష్యా ప్రకటించగా తాజాగా అమెరికా నుంచి మరో శుభవార్త వినిపించింది. ఊహించిన విధంగా మంచి ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

క్లినికల్ ట్రయల్స్ పూర్తై ఫైనల్ టెస్టింగ్ దశకు చేరుకుంది తెలిపారు. జులై 27 నుంచి ఫైనల్ టెస్టింగ్ ప్రక్రియ మొదలు పెడతామని పేర్కొన్నారు. ఈ కరోనా వాక్సీన్‌ను అమెరికా దిగ్గజ ఔషధ సంస్థ మోడర్నా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

కరోనా వాక్సీన్ తీసుకున్న తొలి 45 మందిలో మంచి ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం వాక్సీన్ ఇచ్చిన తర్వాత కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారయ్యాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవు. కొందరిలో మాత్రం ఫ్లూ లక్షణాలు కనిపించాయి.

ఐతే వాంతులు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లేవు. నెలలో రెండు డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫైనల్ టెస్టింగ్ పూర్తైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Tags :
|

Advertisement