Advertisement

వాట్సాప్‌ యూజర్లకు మరో శుభవార్త...

By: chandrasekar Wed, 05 Aug 2020 10:02 AM

వాట్సాప్‌ యూజర్లకు మరో శుభవార్త...


సోషల్ మీడియా యాప్‌లలో ప్రపంచవ్యాప్తంగా సమాచారం కోసం అధికంగా ఉపయోగించే యాప్ లలో వాట్సాప్‌ ఒకటి. ఇది తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్‌ తీసుకువస్తోంది.

ఇప్పటికే మెసేజ్‌, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తో అంద‌రినీ ఆకట్టుకుంటుండగా, యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. ఈ యాప్ ద్వారా త్వరలో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే మాదిరిగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు అందించబోతుంది.

త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాదు ఆర్బీఐ డేటా లోకలైజేషన్ పేమెంట్స్ నిబంధనలను అనుగుణంగా ఈ స‌ర్వీసులు ఉంటాయ‌ని, దీనికి ఎన్‌పీసీఐ కూడా సుముఖంగా ఉందని తెలిపింది. పేమెంట్ స‌ర్వీసుల‌ను అందించ‌డానికి ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు ఏడాది కాలంగా తమ బృందం కృషి చేస్తోంద‌ని వాట్సాప్‌ పేర్కొంది.

Tags :
|
|
|

Advertisement