Advertisement

  • ఇండియన్ పేమెంట్ మార్కెట్‌ లో మరో దిగ్గజం...వాట్సప్ పే...

ఇండియన్ పేమెంట్ మార్కెట్‌ లో మరో దిగ్గజం...వాట్సప్ పే...

By: chandrasekar Fri, 06 Nov 2020 3:50 PM

ఇండియన్ పేమెంట్ మార్కెట్‌ లో మరో దిగ్గజం...వాట్సప్ పే...


ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ ప్రారంభానికి ఇండియాలో అనుమతి లభించింది. అమెజాన్ పే, ఫోన్ పే, గూగుల్ పే , పేటీఎంలకు పోటీగా ఇప్పుడు వాట్సప్ పే. ఇండియాలో పేమెంట్ మార్కెట్ ఇప్పటికే పేటీఎఎం, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పేలు నిండిపోయున్నాయి. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి ఇప్పుడు మరో టెక్ దిగ్గజం వాట్సప్ పేమెంట్ సర్వీసెస్‌ను ఇండియాలో ప్రారంభించనుంది. వాట్సప్ పే ప్రారంభించేందుకు భారతదేశం ఆమోదం తెలియజేసింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ ద్వారా మల్టీ బ్యాంక్ ఏకీకృత చెల్లింపులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. అమెరికాకు చెందిన వాట్సప్ పే 20 మిలియన్ల యూజర్లతో సేవల్ని ప్రారంభించనుంది. వాస్తవానికి ఫేస్‌బుక్ సంస్థ వాట్సప్ పేమెంట్స్‌ను ఇండియాలో ప్రారంభించేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తుంది కానీ రెగ్యులేటరీ సమస్యలతో పైలట్ ప్రాజెక్టు పరిమితమైన యూజర్లకే ఆగిపోయింది.

ఇప్పటికే ఇండియాలో దిగ్గజ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌లు చాలానే ఉన్నా ఇంకా 4 వందల బిలియన్ల కంటే ఎక్కువ మార్కెట్ మిగిలుంది. మార్కెట్‌లో ఉన్న దిగ్గజ పే‌మెంట్ సర్వీసెస్ సంస్థలతో పోటీ పడే సామర్ధ్యమైతే వాట్సప్ పేకు ఉంది. 2023లోగా ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కోసం టార్గెట్ పెట్టుకుంది. మార్కెట్‌లో ఉన్న ప్రత్యర్ధుల్లా కాకుండా వాట్సప్ యాప్ కు ఉన్న ప్రాచుర్యం అదనపు ప్రయోజనంగా మారనుంది. ఎందుకంటే అటు ఫేస్‌బుక్, ఇటు వాట్సప్ రెండింటికీ ఇండియా అతి పెద్ద మార్కెట్ గా ఉంది. ఫేస్‌బుక్ ఈ యేడాది ప్రారంభంలో జియో ప్లాట్‌ఫామ్స్ లో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. వాట్సప్ ఆధారంగా ఇండియాలో భారీగా వాణిజ్యాన్ని విస్తరించాలనేది తన ఉద్దేశ్యంగా ఫేస్‌బుక్ ఇప్పటికే స్పష్టం చేసింది. వాట్సప్ ఇప్పటికే వాణిజ్యపరమైన ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. చిన్న వ్యాపారులు తమ వస్తువుల్ని యాప్ ద్వారా నేరుగా అమ్ముకునే సౌకర్యం కల్పించింది. ఇలాంటి లావాదేవీలకు పేమెంట్ కీలకంగా మారనుంది. ఇప్పుడు వాట్సప్ పే ప్రారంభించడం ద్వారా వాట్సప్ యాప్ యూజర్లకు అదనపు ప్రయోజనం కలగనుంది.

Tags :
|
|

Advertisement