Advertisement

  • మోదీ ప్రభుత్వం మహిళలకు డబ్బులు అందిస్తోందని మరో ఫేక్ మెసేజ్ వైరల్

మోదీ ప్రభుత్వం మహిళలకు డబ్బులు అందిస్తోందని మరో ఫేక్ మెసేజ్ వైరల్

By: chandrasekar Mon, 21 Sept 2020 6:33 PM

మోదీ ప్రభుత్వం మహిళలకు డబ్బులు అందిస్తోందని మరో ఫేక్ మెసేజ్ వైరల్


సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవ్వడం కూడా బాగా పెరిగి౦ది. చాలా ఫేక్ మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో షికార్లు కొడుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు మరో ఫేర్ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. మోదీ ప్రభుత్వం మహిళలకు డబ్బులు అందిస్తోందనేది ఫేక్ మెసేజ్ సారాంశం. మహిళలు అందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లలో వేస్తోందని ఫేక్ మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతోంది. మహిళా స్వరోజ్‌గర్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తోందని ఈ ఫేక్ మెసేజ్‌లో ఉంది.

కేంద్ర ప్రభుత్వం మహిళా స్వరోజ్ గార్ యోజన పేరుతో ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదని స్పష్టం చేసింది. మహిళల బ్యాంక్ అకౌంట్లలో రూ.లక్ష జమ చేయడం లేదని తెలిపినది. ఈ విషయాన్ని నమ్మవద్దని సూచించింది. మీ వివరాలు తెలియజేయవద్దని కోరింది. దేశంలో నిరుద్యోగిత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు వేగంగా వ్యాపిస్తూ౦టాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. అయినా ప్రయోజనం కనిపించడం లేదు.

Tags :

Advertisement