Advertisement

  • రెండో టీ20 మ్యాచ్ లోఆస్ట్రేలియా టీమ్‌కి మరో గట్టి దెబ్బ...

రెండో టీ20 మ్యాచ్ లోఆస్ట్రేలియా టీమ్‌కి మరో గట్టి దెబ్బ...

By: chandrasekar Sat, 05 Dec 2020 5:04 PM

రెండో టీ20 మ్యాచ్ లోఆస్ట్రేలియా టీమ్‌కి మరో గట్టి దెబ్బ...


శుక్రవారం భారత్‌ చేతిలో తొలి టీ20లో ఓడిపోయిన ఆస్ట్రేలియాకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్‌కి గజ్జలో గాయం కావడంతో ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న రెండో టీ20లో అతను ఆడటంపై సందేహంగా మారింది. ఇప్పటికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇదే తరహా గాయంతో టీ20 సిరీస్‌కి దూరమవగా.. మార్కస్ స్టాయినిస్, అస్గన్ అగర్‌లకి కూడా గాయమైన విషయం తెలిసిందే. దాంతో.. మొత్తంగా.. ఆస్ట్రేలియా జట్టులో గాయపడిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకి చేరింది. వన్డే సిరీస్‌లో సెంచరీతో ఫామ్ అందుకున్న అరోన్ ఫించ్.. తొలి టీ20 మ్యాచ్‌లోనూ 26 బంతుల్లో 5x4, 1x6 సాయంతో 35 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా.. ఆరంభంలోనే టీమిండియాని ఆత్మరక్షణలోకి నెట్టే స్థాయిలో అతని హిట్టింగ్ సాగింది.

ఈ నేపథ్యంలో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ అరోన్ ఫించ్ ముందుండి టీమ్‌ని నడిపించాలని ఆస్ట్రేలియా ఆశిస్తోంది. కానీ.. తొలి టీ20లో వికెట్ల మధ్య అసౌకర్యంగా పరుగెత్తుతూ కనిపించిన అరోన్ ఫించ్‌కి స్కాన్ తీయనున్నట్లు ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో గెలిచిన ఆస్ట్రేలియా.. మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం ప్రస్తుతం 0-1తో వెనకబడి ఉంది. ఈ నేపథ్యంలో.. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే ఆదివారం రెండో టీ20తో పాటు మంగళవారం జరగనున్న మూడో టీ20లోనూ గెలవాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌లకీ ఫామ్‌లో ఉన్న ఫించ్ దూరమైతే..? కంగారూలకి కస్టాలు తప్పవు.

Tags :
|

Advertisement