Advertisement

  • కరోనా కేసుల నేపథ్యంలో అన్నవరం దేవాలయం దర్శనాలు నిలిపివేత

కరోనా కేసుల నేపథ్యంలో అన్నవరం దేవాలయం దర్శనాలు నిలిపివేత

By: Sankar Thu, 13 Aug 2020 12:45 PM

కరోనా కేసుల నేపథ్యంలో అన్నవరం దేవాలయం దర్శనాలు నిలిపివేత



ఏపీలో కరోనా విజ‌‌ృంభణ కొనసాగుతోంది. ప్రతీ రోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ప్రముఖ దేవస్థానం అన్నవరం ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో దర్శనాలను ఆగస్టు 23 వరకు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు.

ఇటీవల దేవస్థానం సిబ్బందిలో 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ స్వామివారికి దర్శనం కోసం రావద్దని కోరారు. . ఈ నెల 11న మరో 250 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. రెండ్రోజుల్లో మరో 200 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. వ్రతాలు, కల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల మొదలైన పూజలన్నీ స్వామివారికి ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

Tags :
|
|

Advertisement