Advertisement

  • అన్నాహజారే నిరాహార దీక్షకు దిగారు... ఎందుకో తెలుసా...?

అన్నాహజారే నిరాహార దీక్షకు దిగారు... ఎందుకో తెలుసా...?

By: Anji Tue, 08 Dec 2020 12:51 PM

అన్నాహజారే నిరాహార దీక్షకు దిగారు... ఎందుకో తెలుసా...?

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు భారత్‌ బంద్‌ చేపట్టిన అన్నదాతలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.

రైతులకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే నిరాహార దీక్షకు దిగారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తన స్వగ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలో ఒక రోజు దీక్షకు కూర్చున్నారు.

‘గత కొద్ది రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా రైతులు ఆందోళన సాగించడం అభినందనీయం. ఇప్పుడు ఆ ఆందోళనను దేశమంతా చేపట్టాలని యావత్ ప్రజలను కోరుతున్నా.

ఇందుకోసం రైతులంతా రోడ్డెక్కాలి. అప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రైతుల డిమాండ్లను పరిష్కరిస్తుంది. అయితే, నిరసనల్లో ఎక్కడా హింసకు పాల్పడకూడదు’ అని అన్నాహజారే ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags :
|

Advertisement